కాంగ్రెస్​ను నమ్మి మోసపోయారు : కేటీఆర్

కాంగ్రెస్​ను నమ్మి మోసపోయారు : కేటీఆర్
  • ఆ పార్టీకి ప్రజలంతా బుద్ధి చెప్పాలి: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిని నమ్మి తీవ్రంగా మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఎన్నికల టైమ్​లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓటేశారు. ఇప్పటిదాకా వాటిని అమలు చేయలేదు. ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు. కానీ.. పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది.

 ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌‌ను తిప్పికొట్టాలి. రేవంత్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’అని కేటీఆర్ అన్నారు.   ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని, ఒక పార్టీగా 25 ఏండ్లు ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుందని తెలిపారు.