ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెలరేగిపోతున్నాడు. ఇంగ్లీష్ బ్యాటర్ల పని పడుతూ వరుసపెట్టి వికెట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇంగ్లాండ్ కోల్పోయిన 7 వికెట్లలలో ఐదు కుల్దీప్ యాదవ్ తీసుకోవడం విశేషం. తొలి సెషన్ లో డకెట్, పోప్ వికెట్లను తీసుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్.. రెండో సెషన్ లో మరింతగా రెచ్చిపోయాడు. హాఫ్ సెంచరీ చేసి ప్రమాదకరంగా మారుతున్న క్రాలే(79)ను బౌల్డ్ చేశాడు.
ఇదే ఊపులో బెయిర్ స్టో (29) ను ఔట్ చేసిన కుల్దీప్.. వెంటనే స్టోక్స్ ను డకౌట్ చేసి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. కుల్దీప్ యాదవ్ తో పాటు జడేజా, అశ్విన్ విజ్రంభించడంతో ఇంగ్లాండ్ టీ విరామానికి 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. రూట్ ను జడేజా ఔట్ చేస్తే.. లోయర్ ఆర్డర్ లో హర్టీలి, మార్క్ వుడ్ లను పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం క్రీజ్ లో బెన్ ఫోక్స్ (8), షోయబ్ బషీర్(5) ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసుకోగా.. అశ్విన్ రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది.
2 వికెట్ల నష్టానికి 100 పరుగులతో రెండు సెషన్ ను ప్రారంభించిన ఇంగ్లాండ్.. రెండో సెషన్ లో 6 వికెట్లను కోల్పోయింది. పిచ్ స్పిన్ కు అనుకూలించడం వలన భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. క్రాలే 79 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. మిగిలిన వారందరూ విఫలమయ్యారు.
Tea on Day 1 🏏
— Sportskeeda (@Sportskeeda) March 7, 2024
India in commanding position; courtesy of a brilliant fifer by Kuldeep Yadav! 🇮🇳💪🏻#INDvENG #Cricket #India #Sportskeeda pic.twitter.com/DVv0pkfOIn