టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఆసియా కప్ లో అంచనాలకు మించి రాణించిన కుల్దీప్.. ఆ ఫామ్ ని వరల్డ్ కప్ లో కూడా కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో జరిగిన రెండు మ్యాచుల్లో సత్తా చాటిన ఈ చైనా మన్ స్పిన్నర్ ప్రస్తుతం పాక్ తో జరుగుతున్న మ్యాచులో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచును భారత్ వైపుకు మలుపులు తిప్పాడు.
తొలి 7 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన కుల్దీప్.. తన 8 ఓవర్లో రెండు ప్రధాన వికెట్లు తీసుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 33 ఓవర్లో రెండో బంతికి సౌద్ షకీల్ ని వెనక్కి పంపగా.. ఇదే ఓవర్ చివరి బంతికి ఇఫ్తికార్ ని క్లీన్ బౌల్డ్ చేసాడు. అప్పటికీ 32 ఓవర్లలో 3 వికెట్లకు 162 పరుగులు చేసిన పాక్ ఒక్కసారిగా 166 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇక ఆ తర్వాత బుమ్రా కూడా విజ్రంభించడంతో ప్రస్తుతం పాక్ 36 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. హాసన్ అలీ(1), మహ్మద్ నవాజ్(2) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా, కుల్దీప్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యకు ఒక వికెట్ లభించింది. బాబర్ అజామ్ హాఫ్ సెంచరీ చేయగా.. రిజవాన్ 49 పరుగులతో రాణించాడు.