
కురవి, వెలుగు: కురవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి ,ఈవో సత్యనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామ సేవ ఎదుర్కోలుతో కల్యాణ వేడుకలను నిర్వహించారు.
కాగా, స్వామి దర్శించుకునేందుకు ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహయం రఘురాం రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, ఎమ్మెల్సీ లు సత్యవతి రాథోడ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్, కురవి మాజీ జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, నూకల అభినవ్ రెడ్డి స్వామి వార్లను దర్శించుకోగా, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.