
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ(Khushi). క్లాసిక్ సినిమాలా దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvana) డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఖుషీ నుంచి నాలుగో పాట రిలీజ్ కాబోతుందందని మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
ఎదకు ఒక గాయం అంటూ సాగే ఈ ఎమోషనల్ సాంగ్ ను ఇవాళ (ఆగస్టు 17) సాయంత్రం 6 గంటల 3 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ముసిరే ఆశలు కనబడవా..ఎదకి ఒక గాయం..వదలమంది ప్రాణం..ఎవరు ఇక సొంతం అంటూ ఎమోషనల్ సాగే ఈ గీతం.. రెండు హృదయాల జంటతో కూడిన బాధను క్రియేట్ చేస్తుందని తెలుస్తోంది. అలాగే అభిమానుల హృదయాలని తాకే ఓ మధురమైన లిరిక్స్ తో..గుండెలని గాయ పరిచేలా శివ నిర్వాణ మెలోడీ లిరిక్స్ అందించారు .
ఇప్పటికి రిలీజైన ఖుషి సాంగ్స్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తున్నాయి. శివ నిర్వాణ ఖుషి ఆల్బమ్స్ లోని అన్ని పాటలకు లిరిక్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్(Hesham abdul wahab) హృదయాలను హత్తుకునేలా సాంగ్స్ కంపోజ్ చేశారు.
నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ సినిమాలు తీసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.ఇక ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఖుషి సినిమా థియేటర్లలో 2023 సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
A touching melody to heal the heart ❤️#Kushi Fourth Single #YedhakiOkaGaayam out today at 6.03 PM ❤️?
— Mythri Movie Makers (@MythriOfficial) August 17, 2023
In cinemas SEP 1st?@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @MythriOfficial @saregamasouth pic.twitter.com/FPvu6AHlWL