అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు : అంతటి కాశన్న

అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు : అంతటి కాశన్న

ఉప్పునుంతల, వెలుగు: అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదని  కెవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు  అంతటి కాశన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల పరుశురాములు అన్నారు.  మంగళవారం ఉప్పునుంతల మండలంలోని కొరటికల్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం నిర్వహించిన  సమావేశంలో  మాట్లాడారు.   అంబేద్కర్ విగ్రహ నిర్మాణం అడ్డుకుంటే ఆయన ఆశయాలని అడ్డుకున్నట్టేనని అన్నారు.  గ్రామంలో దళితులపై వివక్ష కొనసాగుతున్నా  కలెక్టర్ పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. 

అంబేద్కర్ విగ్రహం కోసం నిర్మించిన దిమ్మెను అనుమతులు లేవనే కారణంతో తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీవో కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కెవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు  గుండె మల్లేశ్ , మండలం నాయకులు చింతల నాగరాజు, గ్రామ నాయకులు ఆర్కపల్లి ప్రకాశ్, దాసు, శ్రీశైలం, అనిల్, గణేశ్,  సాయి, తేజ,  వెల్టూర్ అంబేద్కర్ యూత్ నాయకులు బాలరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీశైలం, కొరటికల్ గ్రామ దళిత యువకులు, తదితరులు పాల్గొన్నారు.