- మాట.. మాట పెరిగి లోకల్, బిహారీ కూలీల మధ్య ఘర్షణ
- ఉదయం పనులకు వెళ్లే టైంలో ఘటన
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ టోలిచౌకి చౌరస్తాలోని లేబర్ అడ్డాలో బుధ వారం ఉదయం కొంత మంది కూలీలు కొట్టుకున్నారు. లోకల్, బిహారీ కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఏమి జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కొట్లాటను కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో అప్లోడ్చేయడంతో గురువారం వైరల్ గా మారింది.
రోజూలాగే బుధవారం ఉదయం లోకల్, బిహార్‌కు చెందిన వలస కూలీలు టోలిచౌకి లేబర్ అడ్డాకు వచ్చారు. పనులకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. ఓ పని విషయంలో లోకల్, బిహారీ కూలీల మధ్య మాట.. మాట పెరిగి ఘర్షణ పడ్డారు. కర్రలతో దాడిచేసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.