- రద్దీతో లఘు దర్శనం
- ఆదివారం రాత్రి టెంపుల్
- తెరిచే ఉంచిన ఆఫీసర్లు
- దర్శనానికి 8 గంటల సమయం
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు సుమారు లక్ష మంది తరలివచ్చారు. దీంతో సండే రాత్రి ఆలయాన్ని తెరిచి లఘు దర్శనం కల్పించారు. మేడారం జాతర దగ్గర పడుతుండంతో రాష్ర్టం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వందలాది వెహికిల్స్‌తో రాజన్న ఆలయ గుడి చెరువు మైదానం నిండిపోయింది. స్వామి వారి దర్శనానికి 8 గంటలకు పైగా టైం పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
కోడెల టికెట్ల దందా..పట్టుకున్న ఎస్పీఎఫ్
ఆదివారం రాత్రంతా ఆలయాన్ని తెరిచి ఉంచడం అక్రమార్కులకు వరంగా మారింది. దర్శనానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది కోడె మొక్కులు చెల్లించుకుంటారు. అయితే అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆలయంలో డ్యూటీ చేస్తున్న శ్రీనివాస్ అనే సేవాదార్ రూ.200 నాలుగు కోడె టికెట్లను ఒక్కొక్కటి రూ.300 కు అమ్మి వెళ్లిపోయాడు. టికెట్లు కొన్న వ్యక్తి అవే టికెట్లను మళ్లీ రూ.500కు అమ్ముతుండగా ఎస్పీఎఫ్ స్టాఫ్ పట్టుకున్నారు.