పత్తి కొనుగోళ్లను పరిశీలించిన సీసీఐ చైర్మన్

పత్తి కొనుగోళ్లను పరిశీలించిన సీసీఐ చైర్మన్
  • రైతులకు ఇబ్బందులు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు 

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​ పరిధిలోని జిన్నింగ్​ మిల్లులో శుక్రవారం కాటన్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(సీసీఐ) చైర్మన్​, మేనేజింగ్​ డైరెక్టర్​ లలిత్​ కుమార్​ గుప్తా సందర్శించి, పత్తి కొనుగోళ్లను తనిఖీ చేశారు.  వరంగల్​ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్​రెడ్డి​, కాటన్​ అసోసియేషన్​ కార్యవర్గ సభ్యులు ఆయన్ని సన్మానించి భద్రకాళి అమ్మవారి చిత్ర పటాన్ని బహుకరించారు.  సీసీఐ చైర్మన్​ లలిత్​ కుమార్​ గుప్తా మాట్లాడుతూ..  మద్దతు ధర చెల్లించి  రైతుల వద్ద సీసీఐ  క్వాలిటీ పత్తిని కొనుగోలు చేస్తుందన్నారు. 

 రైతులకు ఇబ్బందులు ఉంటే నేరుగా సీసీఐ ఆఫీసులో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.  అనంతరం భద్రకాళి అమ్మవారిని, వెయ్యి స్తంభాల గుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జనరల్ మేనేజర్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అర్జున్ దేవ్, ఉమ్మడి జిల్లా కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతలపల్లి వీర రావు,  దుగ్యాల గోపాల్ రావు, నాగమల్ల ఓంకారేశ్వర్,  పింగిలి మల్లారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.