హైదరాబాద్ కు చేరిన కోర్ట్ కాంప్లెక్స్ వివాదం

హైదరాబాద్ కు చేరిన కోర్ట్ కాంప్లెక్స్ వివాదం
  • ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శితో లాయర్ల భేటీ

గద్వాల, వెలుగు: గద్వాలలో నిర్మించ తలపెట్టిన కోర్టు కాంప్లెక్స్  స్థల వివాదం హైదరాబాద్ కు చేరింది. గద్వాలకు చెందిన లాయర్లు ఆదివారం మాజీ జడ్పీ చైర్​పర్సన్ సరిత, కాంగ్రెస్  సీనియర్  నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తో భేటీ అయ్యారు. గద్వాల కోర్టు కాంప్లెక్స్  స్థల వివాదాన్ని వారికి వివరించారు. గద్వాలకు దూరంగా పూడూరు శివారులోని అనంతపురం గుట్టల్లో కోర్టు కాంప్లెక్స్  నిర్మిస్తే ఎదురయ్యే సమస్యలను వివరించారు. 

పట్టణం సమీపంలోనే కాంప్లెక్స్  నిర్మిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని తెలిపారు. మెజార్టీ లాయర్లు, ప్రజల అభిప్రాయం మేరకు స్థలం ఎంపిక జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఇన్​చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లి పరిష్కరించేందుకు హామీ ఇచ్చినట్లు లాయర్లు తెలిపారు. రఘురాంరెడ్డి, ఆనంద్, జయసింహారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గట్టు సురేశ్, రవి ప్రకాశ్  గౌడ్, నరసింహులు, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు.