బాదుడే బాదుడు : ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు

 బాదుడే బాదుడు : ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో  భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది.   కొత్త  రిజిస్ట్రేషన్​ ఛార్జీలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0- నుంచి 20 శాతం ఛార్జీలు పెంచనున్నట్లు తెలిపారు.  అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలకు  ఈ ఛార్జీల పెంపును మినహాయించనున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్​లో  చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. ఇందులో మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయించారు. ప్రస్తుతం భూమి కొనుగోలు చేస్తే రూ. లక్ష రూపాయిలు రిజిస్ట్రేషన్​ ఫీజు చెల్లిస్తే కొత్త రేట్ల ప్రకారం.. ఫిబ్రవరి 1 నుంచి రూ. 1.20 లక్షలు చెల్లించాల్సి వస్తుంది.  ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  భూమి కొనాలంటే సామాన్యులకు భారంగా మారనుంది.

ALSO READ | ఒక పదవిలో.. ఒక వ్యక్తి మూడుసార్లకు మించి ఉండకూడదు : లోకేష్ సంచలన వ్యాఖ్యలు