
విజయదశమి వేడుకలు ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆలయాలను దర్శించుకొని ఆయుధ పూజ చేశారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో శమీపూజ జరిపి.. స్నేహితులు, బంధువులకు జమ్మి పంచిపెట్టారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ పట్టణాల్లో జరిగిన రావణ దహనంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పటాకులు పేలుస్తూ సందడి చేశారు.
– నెట్‌వర్క్, వెలుగు