జడ్జిపై దాడి దారుణం

జడ్జిపై దాడి దారుణం

హుజూరాబాద్, వెలుగు: రంగారెడ్డి కోర్టులో మహిళా జడ్జిపై దాడి ఖండిస్తూ హుజూరాబాద్‌‌లో లాయర్లు శుక్రవారం నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా లాయర్లు మాట్లాడుతూ కరడుగట్టిన నేరస్తుల కేసులు విచారించే జ్యుడీషియల్ అధికారుల భద్రత కోసం అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి మట్టెల తిరుపతి, అడ్వకేట్లు ముక్కెర రాజు,  శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, భానుకిరణ్, సమ్మిరెడ్డి,ఆకుల శ్రీనివాస్, అశోక్, రాజేశ్, రాజు, శ్రవణ్ పాల్గొన్నారు.

కోరుట్ల,వెలుగు: జడ్జిపై నేరస్తుడి దాడిని నిరసిస్తూ కోరుట్ల కోర్టులో బార్ అసోసియేషన్  అడ్వకేట్లు శుక్రవారం విధులు బహిష్కరించారు. అసోసియేషన్  అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి సుతారి శ్రీనివాస్, అడ్వకేట్లు నిరసనలో పాల్గొన్నారు.