వామ్మో.. ఇదెక్కడి ఐస్ క్రీం అంటూ జనాలు ఆగ్రహం..

ఐస్ క్రీమ్ లల్లో చాలా రకాలను చూశాం.. విన్నాం.. తిన్నాం. కానీ ఇప్పుడొక వెరైటీ ఐసీ క్రీం అందరినీ షేక్ చేసేస్తుంది. ఐస్ క్రీంను ఇష్టపడని వారుండరు. అలాంటిది స్పెషల్ ఐస్ క్రీం అనగానే లొట్టలేసుకుని తింటారు.  ఇప్పుడు కుర్ కురే.. లేస్ తో తయారు చేసిన ఐస్ క్రీం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

లేస్, కుర్ కురేలతో ఐస్ క్రీమ్ ను తయారు చేశాడు ఓ ఫుడ్ వ్యాపారి.. ఓరి దేవుడో ఏంటి ఈ కాంబినేషన్ అనుకుంటున్నారా.. అవును మీరు వింటున్నది అక్షరాల నిజం.. ఈ విచిత్ర వంటకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో వ్యాపారి ముందుగా లేస్, కుర్ కురేలను వేస్తాడు.. దానికి ఐస్ క్రీమ్ ను యాడ్ చేస్తాడు.. ఆ తర్వాత పాలు వేసి దాన్ని బాగా కీమా లాగా చేసి కలుపుతాడు.. తర్వాత రోల్ లాగా చేస్తాడు.. అంతే దాన్ని రోల్ మాదిరి చేసి ఒక కప్ లో పెట్టి ఇస్తాడు.. టేస్ట్ ఏమోగానీ, అది చూడటానికి చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఐస్ క్రీమ్ లంటే ఇష్టపడని వాళ్లు అస్సలు ఉండరు.. చల్లగా తీయ్యగా ఉండటంతో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టంగా లాగిస్తారు.. అయితే మనం ఇప్పటివరకు రకరకాల వెరైటీగా ఐస్ క్రీమ్ లను చూస్తూనే ఉంటాం.. వీటిలో ఎన్ని రుచులు ఉండటం వల్ల ఎక్కువగా వీటిని తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.. తక్కువ ధర కావడంతో ఎక్కువ మంది వీటిని తినడానికి ఇష్టపడతారు.. అయితే ఇప్పుడు చూస్తే లేస్ ఐస్ క్రీమ్ తయారీ వీడియో తెగ వైరల్ అవుతుంది..ఆ ప్రయోగాన్ని చూసి నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ALSO READ :అక్టోబర్ 14 వరకు..ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..

ఫుడ్ కు సంబందించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్య జనాలను ఆకట్టుకోవడం కోసం కొత్త వెరైటీలను తయారు చేస్తున్నారు.. వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు.