
- 2 గంటల పాటు సభను వీక్షించిన విద్యార్థినులు
హైదరాబాద్, వెలుగు: ఎడ్యుకేషన్ టూర్ లో భాగంగా ఎల్ బీ నగర్ ఎస్సీ గురుకుల లా కాలేజ్ స్టూడెంట్స్ బుధవారం అసెంబ్లీకి వచ్చారు. సుమారు 20 మంది లా విద్యార్థినులు గ్యాలరీలో నుంచి 2 గంటల పాటు సభను వీక్షించారు. ప్రత్యక్షంగా అసెంబ్లీ సమావేశాలను చూడటం ఆనందంగా ఉందని పలువురు స్టూడెంట్స్ పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణికి స్టూడెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ గురించి ఎమ్మెల్యేలు మాట్లాడటం, వాళ్ల సందేహాలకు మంత్రులు క్లారిటీ ఇవ్వడం, జవాబులు చెప్పడం ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. బెట్టింగ్ యాప్ లపై చట్టాన్ని అమలు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎంచెప్పడం బాగుందని పలువురు స్టూడెంట్స్ వెల్లడించారు.