తిర్యాణిలో చిరుత సంచారం

తిర్యాణిలో చిరుత సంచారం

తిర్యాణి, వెలుగు: తిర్యాణి మండలం చింతపల్లి అటవీ సమీపంలో శనివారం చెట్టుపై చిరుతపులిని చూసినట్లు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగా.. అటవీ సిబ్బంది ఆదివారం ఆ ప్రాంతంలో గాలించారు.  చిరుతపులి పాదముద్రలను గుర్తించారు. రేంజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఏండ్లకాలంగా ఒక చిరుత సంచరిస్తోందని, ఇప్పుడు కనిపించింది అదేనా,  మరొకటా అనే విషయాన్ని తెలుసుకుంటామని చెప్పారు. 

ఈ నేపథ్యంలోనే అటవీ సమీపంలోని గ్రామాల్లో ఫారెస్ట్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. చేన్లు, పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులు సంచరించాలని సూచించారు. ఎక్కడైనా వన్యప్రాణులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని, వాటిని వేటాడొద్దని సూచించారు.