యశోద హాస్పిటల్​లో ల్యాపురో కాన్ఫరెన్స్‌‌

యశోద హాస్పిటల్​లో ల్యాపురో కాన్ఫరెన్స్‌‌

హైదరాబాద్, వెలుగు: ల్యాప్రోస్కోపిక్ సర్జరీల నుంచి రోబోటిక్ సర్జరీల వరకూ యూరాలజీలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య విధానాలపై హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్‌‌లో ఆదివారం లైవ్‌‌ వర్క్‌‌ షాప్‌‌, సెమినార్ నిర్వహించారు. ల్యాపురో 24(LAP-URO'24) పేరుతో జరిగిన ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన యూరాలజీ ఎక్స్‌‌పర్ట్స్ పాల్గొని, తమ అనుభవాలను, యూరాలజీ సర్జరీ విభాగంలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని వివరించారు.

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్  సీనియర్ యూరాలజిస్ట్, డాక్టర్ గుత్తా శ్రీనివాస్ మాట్లాడుతూ..ఈ సదస్సులో పీడియాట్రిక్ యూరాలజీ, యూరో-ఆంకాలజీ, రీకన్‌‌స్ట్రక్టివ్ యూరాలజీ, రీనల్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్‌‌లో ఆవిష్కరణలపై చర్చించామని తెలిపారు. ప్రొఫెసర్ అనంత్ కుమార్, డాక్టర్ అరవింద్ గన్‌‌పూలే, డాక్టర్ జమాల్ రిజ్వీ , డాక్టర్ శ్రీహర్ష వంటి నిపుణులు రాడికల్ ప్రోస్టెటెక్టమీ నుంచి మూత్రపిండ మార్పిడి వరకు, యూరాలజికల్‌‌లో కొత్త బెంచ్‌‌మార్క్‌‌లను సెట్ చేయడం వరకు కీలకమైన అంశాలపై చర్చలు జరిపారన్నారు.  భవిష్యత్తులో అన్ని ఆధునిక చికిత్స పద్ధతులను యశోద హాస్పిటల్స్‌‌లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.