లిండె ఆల్‌‌‌‌రౌండ్ షో

లిండె ఆల్‌‌‌‌రౌండ్ షో
  • తొలి టీ20లో పాక్‌‌‌‌పై సౌతాఫ్రికా విక్టరీ

డర్బన్‌‌‌‌: డేవిడ్ మిల్లర్ (82) మెరుపులకు తోడు  జార్జ్‌‌‌‌ లిండె (48; 4/21) ఆల్‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌తో ఆకట్టుకోవడంతో పాకిస్తాన్‌‌‌‌తో తొలి టీ20లో ఆతిథ్య సౌతాఫ్రికా 11 రన్స్‌‌‌‌ తేడాతో   విజయం సాధించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ పోరులో తొలుత సఫారీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 183/9 స్కోరు చేసింది. 

 అనంతరం ఛేజింగ్‌‌‌‌లో పాక్ ఓవర్లన్నీ ఆడి 172/8 స్కోరు చేసి ఓడింది. ఓపెనర్, కెప్టెన్ రిజ్వాన్ (74), సైమ్‌‌‌‌ ఆయుబ్ (31) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. లిండె నాలుగు, మఫాకా రెండు వికెట్లు పడగొట్టారు. లిండెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో టీ20 శుక్రవారం సెంచూరియన్‌‌‌‌లో జరుగుతుంది.