
అడవికి రాజు సింహం. సింహం గాండ్రించిందంటే చాలు..ఏ జంతువైనా..నోరుమూసుకుని వెళ్లాల్సిందే. అంతా అన్ని జంతువులపై ఆధిపత్యం చలాయిస్తుంటుంది సింహం. అయితే ఓ వీడియోలో మాత్రం సింహానికే ఎదురునిలిచింది పెద్దపులి. దీంతో ఈ రెండు జంతువులు భీకరంగా పోట్లాడుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
భీకర పోరు..
ఓ వీడియోలో సింహం, పెద్దపులి ఎదురుపడతాయి. అయితే సింహాన్ని చూసిన పెద్దపులి గాండ్రిస్తుంది. అటు సింహం కూడా గాండ్రిస్తుంది. ఆ తర్వాత సింహం వెనుదిరిగి పోతున్నట్లు కనిపించినా..వెంటనే పెద్దపులిపైకి దూకుతుంది. ఈ రెండు భీకరంగా పోట్లాడుకున్నాయి. ఒకటిపై మరొకటి పంజా విసురుకున్నాయి. ఇంతలో రెండు ఆడ సింహాలు..సింహాన్ని ఆపే ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
సింహం గెలిచిందా..పులి గెలిచిందా..?
ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు సింహానికి అనుకూలంగా..మరికొందరు పెద్దపులికి అనుకూలంగా కామెంట్స్ చేశారు. రెండింటిలో సింహం బలంగా ఉందని కొందరు..పెద్దపులి బలంగా ఉందని మరికొందరు వాదించుకున్నారు. ఈ వీడియోను 20 వేల మంది వీక్షించారు. 1500 మంది లైక్ చేశారు.