ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అరుదైన అవార్డు అందుకున్నాడు. 2022 ఫిఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డు అతనికి లభించింది. 2022 ఖతార్ ఫిఫా ప్రపంచకప్లో మెస్సీ అర్జెంటీనాను విజేతగా నిలిపాడు. అంతేకాకుండా టోర్నీలో కీలక సమయంలో రాణించాడు. దీంతో మెస్సీకి మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కింది.
రెండో సారి
బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకోవడం మెస్సీకిది రెండో సారి. గతంలో 2018లోనూ మెస్సీ ఈ అవార్డును దక్కించుకున్నాడు. అటు మెస్సీకంటే ముందు 2016,2017లో క్రిస్టియానో రొనాల్డో ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు. వీరితో పాటు.. రాబర్ట్ లెవాండోస్కీ (2020, 2021) కూడా రెండుసార్లు ఈ అవార్డును అందుకోవడం విశేషం.
మెస్సీ వర్సెస్ రొనాల్డో
ఫుట్ బాల్ లో దిగ్గజ ఆటగాళ్లుగా పేరొందిన మెస్సీ, క్రిస్టియన్ రొనాల్డో అవార్డుల విషయంలోనూ పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలు క్లబ్ ల తరపున అనేక అవార్డులను సాధించారు. తాజాగా బెస్ట్ ప్లేయర్ అవార్డులను ఇద్దరు చెరో రెండు సార్లు దక్కించుకున్నారు. మొత్తంగా మెస్సీ ఖాతాలో ప్రస్తుతం 17 అవార్డులుండగా...రొనాల్డో 16 అవార్డులను సాధించాడు.