![ఇంటిపై కూలిన భారీ వృక్షం](https://static.v6velugu.com/uploads/2025/02/locals-protest-after-tree-falls-on-building-during-beautification-work-in-ashwaraopet_dJWsI9xH2z.jpg)
- ఆందోళన చేపట్టిన స్థానికులు
అశ్వారావుపేట, వెలుగు: పేట సుందరీకరణ పనుల్లో భాగంగా పట్టణంలోని ఖమ్మం రోడ్ లో రోడ్డు విస్తీర్ణం కోసం జేసీబీతో రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాలను తొలగిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఓ చెట్టు ఒక బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న రేకుల షెడ్డుపై పడింది. అందులో ఉన్న వారంతా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.
దీన్ని గమనించిన జేసీబీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వారు, గ్రామస్తులతో కలిసి జేసీబీ దగ్గర ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆర్ అండ్ బీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చచెప్పారు. కాంట్రాక్టర్ తో నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.