దేశవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. 40.32 % పోలింగ్

దేశవ్యాప్తంగా  మధ్యాహ్నం ఒంటి గంట వరకు..    40.32 % పోలింగ్

దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగతుంది. పోలింగ్ స్టేషన్లకు  ఓటర్లు భారీగా బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు  40.32 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా  పశ్చిమ బెంగాల్ :  51.87% పోలింగ్ నమోదు అయింది.  ఇక తెలుగు రాష్ట్రాలైన  ఆంధ్రప్రదేశ్ లో 40.26%, తెలంగాణలో 40.38% ఓటింగ్ శాతం నమోదైనట్లుగా ఈసీ వెల్లడించింది.  

నాలుగో విడత పోలింగ్ 96 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు  ప్రారంభమైంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఒడిశాలో ఇద్దరు పోలింగ్ అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.  హైదరాబాద్  బీజేపీ ఎంపీ అభ్యర్థి  మాధవీలతపై కేసు నమోదైంది. ఓ పోలింగ్ బూత్‌లో ముస్లిం మహిళల ముఖంపై బురఖాలను ఆమె తొలగించిన తీరుపై అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ కేసు నమోదుకు పోలీసులను ఆదేశించారు. 

రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం

  • ఆంధ్రప్రదేశ్: 40.26% 
  • బీహార్: 34.44% 
  • జమ్మూ కాశ్మీర్: 23.57%
  • జార్ఖండ్: 43.80% 
  • మధ్యప్రదేశ్: 48.52% 
  • మహారాష్ట్ర: 30.85% 
  • ఒడిశా: 39.30%
  • తెలంగాణ: 40.38%
  • ఉత్తరప్రదేశ్ : 39.65  % .
  • పశ్చిమ బెంగాల్ :  51.87%