Spiritual : భగవంతుడిని ఎందుకు స్మరించాలి.. శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశం ఇదే..

Spiritual :  భగవంతుడిని ఎందుకు స్మరించాలి.. శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశం ఇదే..

హిందువులు భగవంతుని నామం ఎప్పుడో ఒకప్పుడు తలుచుకుంటుంటారు.  కొంతమంది నిత్యం  భగవంతుని పూజిస్తే.. కొంతమంది వారానికొకసారి.. ఇంకొంతమంది పండగలకు.. పుణ్యదినాల్లో భగవంతుని జపిస్తూ పూజలు చేశారు.  భగవంతుని నామం స్మరించినా, ఆ రూపాన్ని ధ్యానించినా శుభంకరం అని భావిస్తుంటారు. దీని విషయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడో తెలుసుకుందాం..

హిందువులందరూ భగవంతుడిని ధ్యానం చేస్తారు.  అలా చేస్తే మన కోర్కెల చిట్టాలను ఆయనకు చెబుతూ.. స్వామి నా కష్టాలు తీర్చు..నా కోరికలు తీర్చు..అంటూ స్వామికి విన్నవించుకుంటారు.  ఇలా భగవంతుని నామం జపిస్తూ... రూపం స్వామి అనుగ్రహం పొందడానికి పాటుపడతారు. 

భగవాన్..  నువ్వు అనేక నామాలను ఏర్పరచి, వాటిలో నీ సర్వశక్తులను నింపి ఉంచావు. వాటన్నింటిలో ఈశ్వరశక్తి నిండియుండడం చేత  ఆ నామాలన్నీ మంత్రాలయ్యాయి. మననం చేసేవారిని కాపాడేది మంత్రం. అందుకే నామమే మంత్రం. ఆ నామశక్తిని రూపింపజేసేది రూపం అని తెలిపారు.భగవంతుడు  నృసింహ, వామన, రామ, కృష్ణాది అవతార స్వరూపాలు సైతం పాంచభౌతికాలుగా గోచరించినా అవి 'అప్రాకృతదివ్యతనువులు'. ప్రకృతి వికారాలు లేనివి శివపురాణం ద్వారా తెలుస్తుంది.

భావాన్ని ప్రకటించితే రూపంగా మారుతుంది. భగవంతుడు తన అనంత కళ్యాణ గుణాలను రూపంద్వారా ప్రకటించుతాడు. ఈ అర్థంలో 'రూపు' శబ్దానికి 'ఆకారం' అనే కాక 'లీల' అని కూడా గ్రహించవచ్చు. భగవంతుని కృత్యాలు (ప్రకటనలు) లీలలు. అవి మనలను సన్మార్గంలో నడిపించడం.. మన కోర్కెలు తీర్చడానికి... లోక  కల్యాణం కోసమే గానీ తన ప్రయోజనం కోసం కావు.

Also Read :- షార్ట్‌‌‌‌‌‌‌‌ వీడియోలతో సెలబ్రిటీ.. ఎవరీ నీతు బిష్త్?

భగవంతుని రూపాలన్నీ మనం కల్పించుకున్నవి కావు. ఋషులు తపస్సుతో దర్శించినవి. వారికి దర్శనం - ... మనకు ధ్యానం. వారికి విజ్ఞానం..  - మనకు విశ్వాసం. వారు దర్శించి వర్ణించినవే  మనకు ధ్యానశ్లోకాలుగా మారాయని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది.  భగవంతుని  రూపాన్ని హృదయంలో తలచుకున్నవారికి ఈశ్వర చైతన్యం వారి ప్రాణశక్తిలో సన్నిహితమై ఉండి, సర్వదా శుభాలను సమకూర్చుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడని పండితులు చెబుతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే పుణ్య క్షేత్రాలను సందర్శించడం... దేవుడి భజనలు.. ఊరేగింపులు..దేవుడి ఉత్సవాలు మొదలగు వాటిని నిర్వహించుకుంటున్నాము. భగవంతుని  రూపాన్ని మనలో సన్నిహితం చేసేది నామస్మరణ మాత్రమే నని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

భగవంతుని నామం స్మరించగానే  ఒక రూపం స్ఫురిస్తుంది.  భగవంతుడిని  విగ్రహ రూపంలో గాని .. చిత్రపటం రూపంలోగాని పూజిస్తూ , కీర్తనలుగా  స్తోత్రాలను చదువుతారు. స్వామి నామ జప, స్తోత్ర పఠనాలతో దేవతాస్వరూపం  ఆవిష్కృతమై సాధకులు ఇహపరసిద్ధులు సాధిస్తారని పండితులు చెబుతున్నారు.   పరమాత్ముని సాకార సగుణ రూపాలన్నీ శాశ్వతంగా ఉంటాయి.  వాటికి ఎవరూ హాని చేయలేరు.. నాశనం చేయలేదు.  భగవంతుని నామాలకు ప్రకృతి కూడా ఎలాంటి అపకారం చేయలేదు.  అంటే ప్రకృతిని భగవంతుడి లొంగదీసుకొన్నాడు. 

సర్వసద్గుణములతో భగవంతుని నామాలు ఉన్నాయి.  ఇవి అన్ని సర్వసుమంగళ సంపూర్ణములు.దివ్యమంగళవిగ్రహం, 'సచ్చిదానంద విగ్రహం'- అనే మాటలు దేవతా రూపాలను ఉద్దేశించి పలకడంలో ఆంతర్యం ఇదే. వేదం పలికిన 'కళ్యాణతమం' అనే వచనం .. ఇంత లోతైన భావాలను వ్యక్తం చేస్తోందని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు.