ఈ మధ్య కాలంలో బిజినెస్ పెంచుకోవడానికి షాపు యజమానులు.. తమ కంపెనీ సేల్స్ పెంచుకోవడానికి కంపెనీలు.. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ.. అని లేదా ఒక వస్తువు కొంటే మరొకవస్తువు ఉచితం అని ప్రకటిస్తున్నాయి. జనాలు అలవాటైన తరువాత నెమ్మదిగా అలాంటి వాటిని తీసేస్తారనుకోండి. అయితే తాజాగా ఓ ఐస్ క్రీం కంపెనీ విచిత్రమైన ఆపర్ ప్రకటించింది. ఐస్ క్రీం కావాలంటే .. డబ్బులు అక్కర్లేదట... కాని గట్టిగా అరిస్తే చాలు ఐస్ క్రీం ఫ్రీగా ఇస్తారంట... ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే .....
ఓ మిషన్ ముందు నిలబడి బిగ్గరగా అరిస్తే ఉచిత ఐస్ క్రీమ్ దొరికితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. అవును ఒక షాప్ లో ఒక యంత్రం అమర్చబడిన ప్రదేశం ఉంది. ఆ యంత్రం ముందు ఎవరైనా బిగ్గరగా అరిస్తే ఐస్‌క్రీమ్ ఉచితంగా ఇస్తుంది. గట్టిగా అరిస్తే యంత్రం లోపల కర్టెన్ పైకి లేచి ఐస్ క్రీం ఉచితంగా లభిస్తుంది.
సాధారణంగా వేసవి కాలం వస్తే చాలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా డబ్బులతో ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటారు. అలా కాకుండా గట్టిగా అరిస్తే ఫ్రీగా ఐస్ క్రీమ్ దొరికితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఎక్కడైనా ఫ్రీగా ఐస్ క్రీం ఇస్తారా మన పిచ్చి అనుకుంటే ..మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే సింగపూర్‌లోని ఒక షాప్ లోని మిషన్ ముందు ఎవరైనా గట్టిగా అరిస్తే ఆ మిషన్ లోపల కర్టెన్ పైకి లేచి వారికి ఐస్‌క్రీమ్ ఫ్రీగా ఇస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Scream to get a free scream.#weird #interesting #amazing #viralvideo #woah pic.twitter.com/gID6TbBJai
— Unique Stuff (@un1questuff) April 2, 2024
తాజాగా @Rainmaker1973 అనే IDతో ట్విట్టర్‌లో షేర్ అయిన వీడియోలో మెషిన్ ముందు ఓ యువకుడు నిలబడి స్టార్టింగ్‌లో మెల్లగా అరిచాడు. దీంతో ఆ షాప్ కర్టెన్ కొద్దిగా పైకి లేచి మళ్ళీ కిందకి దిగి పోయింది. దాంతో ఈ సారి కర్టెన్ పైకి వెళ్లేంత గట్టిగా అరుస్తాడు. అప్పుడు అతనికి ఫ్రీగా ఐస్ క్రీం లభిస్తుంది. దీంతో ఇదేదో బాగుంది అన్నట్టు తర్వాత మరికొందరు కూడా గట్టిగా కేకలు వేస్తూ వారు కూడా ఐస్ క్రీం ఫ్రీగా గెలుచుకున్నారు. కాగా కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 28 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒకరు మనిషి ప్రీగా వస్తుంది అంటే చాలు ఏమి చేయడానికైనా రెడీ అని కామెంట్ చేయగా.. చిన్న వస్తువు అయినా సరే ఉచితంగా లభిస్తే దేనికైనా సిద్ధంగా ఉంటాడు అని మరొకరు రాశారు, ‘ఉచిత ఐస్‌క్రీం పొందడం కోసం అరవడం కూడా మీ స్వర పేటిక తంతువులను పరీక్షించడానికి గొప్ప మార్గం’ అని రాశారు.