ప్రేమకు అడ్డొస్తుందని..ప్రియురాలి తల్లిపై ప్రేమోన్మాది దాడి

ప్రేమకు అడ్డొస్తుందని..ప్రియురాలి తల్లిపై ప్రేమోన్మాది దాడి

కరీంనగర్  జిల్లా రామడుగు మండలం వన్నారంలో దారుణం జరిగింది. తమ ప్రేమకు అడొస్తుందనే కారణంతో  ప్రియురాలి  తల్లిపై ప్రేమోన్మాది దాడి చేశాడు.  గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు. మార్చి 1న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 

సుద్దాలపల్లి గ్రామానికి చెందిన దూట రాజ్ కమార్, జాడి సుస్మిత అనే యువతితో కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి సుష్మితను మందలించింది తల్లి చామంతి. పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి పరిస్థితి వివరించి కూతురు మనసు మార్చింది. అయితే   తమ ప్రేమకు అడ్డు వస్తుందనే  కారణంతో ఎలాగైనా ప్రియురాలి తల్లిని చంపలానే కసితో బహిరంగంగానే చామంతిని తీవ్రంగా కొట్టి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు రాజ్ కుమార్. కూతురు సుస్మిత అడ్డుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది తల్లి చామంతి. కూతురు సుస్మిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.