సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్ పాహాడ్ గ్రామంలో పురుగు మందు తాగి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన ప్రేమికులు గుండగాని సంజయ్ (26), చల్లగుండ నాగజ్యోతి (24) ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అడ్డుపడుతుండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.