
- ఓపెన్కాని వెబ్సైట్
- ఈ నెల 31 వరకు రుసుంలో 25 శాతం మినహాయింపు
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో ఎల్ఆర్ఎస్ ఫీజ్ చెల్లింపునకు వెబ్సైట్ కష్టాలు వచ్చి పడ్డాయి. ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం 25 శాతం డిస్కౌంట్ ఇచ్చి, ఈనెల 31 వరకూ డెడ్లైన్ పెట్టింది. దీంతో జిల్లాలో ఫీజ్ చెల్లించాలనుకుంటున్న వారు మున్సిపల్ ఆఫీస్కు వచ్చి వెనుదిరుగుతున్నారు. వెబ్సైట్ పని చేయకపోవడంతో ఫీజ్ చెల్లించలేకపోతున్నారు.
ఈ వెబ్సైట్ అప్డేట్ చేయడానికి మరి కొన్ని రోజులు పట్టేలా ఉంది. దీంతో మరో వారం , 10 రోజుల తర్వాత రమ్మని ఇక్కడి సిబ్బంది దరఖాస్తుదారులకు చెబుతున్నారు. ఫోన్లు చేసి ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని చెప్పి.. తీరా ఆఫీసుకు వెళితే ఆన్లైన్ పని చేయట్లేదని చెప్పటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
2020లో అప్లికేషన్ ఫీజు రూ. వెయ్యి చెల్లించి రెగ్యులరైజ్ కోసం వేలాది మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తే.. ప్లాట్ల ఓనర్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు ఎంత అనేది వస్తుంది. గతంలో ఆ ఫీజులు ఎక్కువ ఉన్నాయని ఎల్ఆర్ఎస్ పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వం డిస్కౌంట్ ప్రకటించింది. దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సంబంధింత వ్యక్తులకు ఫోన్ చేసి మిగతా అమౌంట్ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇది
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 17,613 అప్లికేషన్లు, బాన్సువాడలో 1670, ఎల్లారెడ్డిలో 897 అప్లికేషన్లు వచ్చాయి. కామారెడ్డిలో మొత్తం అప్లికేషన్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి 6,375 అప్లీకేషన్లకు ఫీజు జనరేట్ చేశారు. ఇంకా కొన్ని అప్లికేషన్లు పరిశీలన దశలో ఉండగా, ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. దీంతో వారు 2 రోజులుగా మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు.
సమస్య పరిష్కారమవుతుంది
ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ ఆప్డేట్ దృష్ట్యా ఆన్లైన్ ఓపెన్ కావట్లేదు. కొద్ది రోజుల్లోనే సమస్య క్లియర్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ కాగానే ఫీజు జనరేట్ అయిన వారిలో ఆసక్తి ఉన్న వారి నుంచి అమౌంట్ కలెక్టు చేసుకొని వారి ప్లాట్లను రెగ్యులరైజ్ చేస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్