RR vs LSG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో.. శాంసన్ స్థానంలో 14 ఏళ్ళ కుర్రాడు

RR vs LSG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో.. శాంసన్ స్థానంలో 14 ఏళ్ళ కుర్రాడు

ఐపీఎల్ 2025 లో శనివారం (ఏప్రిల్ 19) రెండో మ్యాచ్ ప్రారంభమైంది. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్  తలపడనుంది. ఈ మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీలో లక్నో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ ల్లో గెలిచింది. మరోవైపు రాజస్థాన్ ఆడిన 7 మ్యాచ్ ల్లో రెండు గెలిచింది. ఈ మ్యాచ్ లో లక్నో గెలిస్తే ప్లే ఆఫ్ కు దగ్గరకు చేరుతుంది. రాజస్థాన్ ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. 

ప్లేయింగ్ 11 విషయానికి వస్తే లక్నో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ఆకాష్ దీప్ స్థానంలో ప్రిన్స్ జట్టులోకి వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో 14 ఏళ్ళ టీనేజ్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ.. సంజు శాంసన్ స్థానంలో తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే