మంత్రిని కలిసిన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్

మంత్రిని కలిసిన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్

సంగారెడ్డి, వెలుగు: రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్ మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహను మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫహీమ్ ను మంత్రి దామోదర అభినందించారు.

అనంతరం మంత్రిని ఫహీమ్ శాలువాతో సన్మానించారు. ఫుడ్ చైర్మన్ హోదాలో ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని మంత్రి సూచించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని చైర్మన్ ఫహీమ్ స్పష్టం చేశారు.