
- 14వ తేదీన నిజామాబాద్ నుంచి ప్రారంభం
ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజ్య సాధన కోసం లక్ష కిలోమీటర్ల ‘మా భూమి రథయాత్ర’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ డైట్ కాలేజీ గ్రౌండ్ నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం గడప గడపకు 10 వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా ఉంటుంది. నిజామాబాద్‌లో ప్రారంభమవుతున్న ‘మా భూమి రథయాత్ర’ 39 నెలల పాటు రాష్ట్ర మంతా తిరుగుతది’’ అని విశారదన్ మహరాజ్ అన్నారు.