ఏసుకోండ్రా మీమ్స్.. చేసుకోండ్రా రీల్స్

ఏసుకోండ్రా మీమ్స్.. చేసుకోండ్రా రీల్స్

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌‌‌‌లో కళ్యాణ్ శంకర్ రూపొందించిన  చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్‌‌‌‌‌‌‌‌’.  రెండేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్ సాధించిన ‘మ్యాడ్‌‌‌‌’కు ఇది సీక్వెల్. మార్చి 28న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్.. మంగళవారం మూడో పాటను రిలీజ్ చేశారు.  మ్యాడ్ గ్యాంగ్‌‌‌‌కి తిరిగి స్వాగతం పలికినట్టుగా ‘వచ్చార్రోయ్’ అంటూ  సాగిన ఈ పాట ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా సాగింది.  భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయడంతో పాటు తాను పాడిన విధానం ఆకట్టుకుంది. 

 ‘ఏసుకోండ్రా మీమ్స్, చేసుకోండ్రా రీల్స్, రాసుకోండ్రా హెడ్ లైన్స్..  ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్’  అంటూ దర్శకుడు కె.వి.అనుదీప్ రాసిన లిరిక్స్ స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచాయి. ఫస్ట్ పార్ట్‌‌‌‌లో   తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌‌‌‌లు  ‘మ్యాడ్ స్క్వేర్’లోనూ  అంతకుమించిన అల్లరి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో  మురళీధర్ గౌడ్, కె.వి. అనుదీప్ కీలక పాత్రలు పోషించారు.  అలాగే, రెబా మోనికా జాన్ స్పెషల్ సాంగ్‌‌‌‌లో  సందడి చేయనుంది. నాగవంశీ సమర్పణలో  హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు.