![తెలుగు సాహిత్యంపై అంబేద్కర్‌ది చెరగని ముద్ర : వీసీ మధుజ్యోతి](https://static.v6velugu.com/uploads/2025/02/madhu-jyoti-vc-of-padmavati-university-in-tirupati-says-ambedkar-indelible-mark-on-telugu-literature_mbPH9GKDEh.jpg)
- తిరుపతిలోని పద్మావతి వర్సిటీ వీసీ మధుజ్యోతి
సిద్దిపేట, వెలుగు : ‘తెలుగు సాహిత్యంపై అంబేద్కర్ చెరగని ముద్ర వేశారు, తెలుగు సాహిత్య చరిత్రలో అంబేద్కర్ భావజాలం స్పష్టంగా కనిపిస్తోంది’ అని తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ కొలకలూరి మధుజ్యోతి చెప్పారు. ‘తెలుగు సాహిత్యం – అంబేద్కర్ ప్రభావం’ అనే అంశంపై ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేటలోని విపంచి కళానిలయం (బోయి విజయభారతి ప్రాంగణం)లో శనివారం నిర్వహించిన వార్షిక సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు.
అసమానతల నిర్మూలనలో అంబేద్కర్ ప్రభావం ఉందన్నారు. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మతం ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని నడిపిస్తోందన్నారు. అంబేద్కర్‌ను జాగ్రత్తగా గమనించి ఉంటే ఇప్పుడు కమ్యూనిస్టులకు, అంబేద్కరిస్టులకు మధ్య క్లాష్ వచ్చి ఉండేది కాదన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, ఏపీ, తెలంగాణ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యక్షురాలు అనిశెట్టి రజిత, ప్రధాన కార్యదర్శి కాత్యాయనీ విద్మహే, ప్రొఫెసర్ బన్న ఐలయ్య, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, డాక్టర్ గంధం అరుణ, మంజీరా రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు రంగాచారి, ప్రధాన కార్యదర్శి సిద్దంకి యాదగిరి పాల్గొన్నారు.