మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.ఈ క్రమంలో జనతా కర్ఫ్యూను ఈ నెల 15 వరకు పొడిగించాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ప్రకటన చేశారు. ఈ కర్ఫ్యూను కూడా కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏప్రిల్ 21 వరకు కరోనా వ్యాప్తిలో ఏడవ స్థానంలో ఉండగా..మీ మద్దతుతోనే ఆ స్థానాన్ని 14కు చేర్చామని ప్రజలనుద్దేశించి చెప్పారు. కరోనాను అరికట్టడంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 15 వరకు వివాహాలు, ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.