DC vs SRH: సన్ రైజర్స్ పరుగుల వరద.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

DC vs SRH: సన్ రైజర్స్ పరుగుల వరద.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్ లో సన్ రైజర్స్ తన జోరును కొనసాగిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా భారీ స్కోర్లు చేస్తూ సవాలు విసురుతుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారీ స్కోర్ చేసి సత్తా చాటింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(32 బంతుల్లో 89,11 ఫోర్లు, 6 సిక్సులు), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 46, 2 ఫోర్లు, 6 సిక్సులు) శివాలెత్తడం.. చివర్లో షాబాజ్ అహ్మద్(29 బంతుల్లో 59,2 ఫోర్లు,5 సిక్సులు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ తొలి ఓవర్ నుంచే విధ్వంసం సృష్టించారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరి ధాటికి తొలి ఓవర్లో 19 పరుగులు.. రెండో ఓవర్లో 21.. మూడో ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. తొలి మూడు ఓవర్లలోనే ఏకంగా 62 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మూడు ఓవర్లలో మరో 63 పరుగులు పిండుకున్నారు. పవర్ ప్లే లో ట్రావిస్ హెడ్ 26 బంతుల్లో  11 ఫోర్లు, 6 సిక్సులతో 84 పరుగులు చేస్తే.. మరో ఎండ్ లో అభిషేక్ శర్మ 10 బంతుల్లోనే 5 సిక్సులు, 2 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. 

స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడం.. క్లాసన్, మార్కరం విఫలమవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ గేమ్ లోకి వచ్చింది. ఈ దశలో సన్ రైజర్స్ ను నితీష్ రెడ్డి(37), షాబాజ్ అహ్మద్(59) ఆదుకున్నారు. ఓ వైపు సింగిల్స్ తీస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో స్కోర్ బోర్డు 250 పరుగుల మార్క్ దాటింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.