
- సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానపత్రిక అందజేత
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 23న నిర్వహించే 'మహాకుంభ సంప్రోక్షణ'కు రావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ ఈవో భాస్కర్ రావు కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. గురువారం ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతోపాటు హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో సీఎంను కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. అనంతరం సీఎస్ శాంతికుమారిని కలిసి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఉత్సవాలకు ఆహ్వానించారు. సీఎంను కలిసిన వారిలో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆలయ ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు ఉన్నారు.