ఢిల్లీ తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూలే జయంతి

ఢిల్లీ తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూలే జయంతి

న్యూఢిల్లీ, వెలుగు: మహాత్మా జ్యోతి రావ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూలే 199వ జయంతి వేడుకలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్సీ) గౌరవ్ ఉప్పల్ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు.

 అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారన్నారు. 1848లో పునెలో బాలికల కోసం మొదటి పాఠశాలను ఆయన ప్రారంభించారని వివరించారు. చదువు ఏ వర్గానికో పరిమితం కాకూడదని అందరికీ అందుబాటులో ఉండాలని, తద్వారానే సమాజం అభివృద్ధి సాధ్యమని భావించిన మొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే చెప్పారు.