
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలానగర్ మండలం మోతిఘనపూర్ గ్రామ శివారులో శ్రీనాథ్ రోటోప్యాక్ పరిశ్రమలో ఫర్నేస్ పేలింది. ఈ ఘటనలో 13 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.