గ్రూప్–2 పరీక్షలకు ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ విజయేందిర బోయి

 గ్రూప్–2 పరీక్షలకు ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ విజయేందిర బోయి
  • అధికారులకు కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాలు 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: గ్రూప్ 2 పరీక్షలు సజావుగా  నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.  ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-–2 పరీక్షల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్‌‌‌‌లో రీజినల్  కో ఆర్డినేటర్లు, డిపార్టుమెంటల్ అధికారులు, రూట్ అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్, ఐడెంటిఫికేషన్ అధికారులతో  సమావేశం  నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 20,584 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. 15న ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు, 16వ తేదీ ఉదయం,10 గంటల నుంచి 12.30  వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5. 30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.  సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. 

వేపూర్ స్కూల్‌‌‌‌ను  తనిఖీ చేసిన కలెక్టర్ 

హన్వాడ,  వెలుగు: మండలంలోని వేపూర్  గ్రామ జడ్పీహెచ్ఎస్  స్కూల్‌‌‌‌ను మంగళవారం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు.  స్కూల్‌‌‌‌లోని వంటగది,  స్టోర్ రూంలను పరిశీలించారు.  వంటగది క్లీన్ గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం టెన్త్  స్టూడెంట్స్ తో మాట్లాడారు. పాఠ్యాంశాలు, బోధన గురించి స్టూడెంట్స్ ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్పెషల్ క్లాస్ గురించి అడిగారు.  హెచ్ఎం గౌరీ శంకర్ ఉన్నారు.