కౌలాలంపూర్: ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో సెమీస్‌తోనే సరిపెట్టారు. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్‌లో ఏడోసీడ్ సాత్విక్–చిరాగ్ 10–21, 15–21తో కిమ్ వోన్–సియో సుయాంగ్ జీ (కొరియా) చేతిలో ఓడారు.
40 నిమిషాల మ్యాచ్‌లో ఇండియా షట్లర్లు స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్ చూపెట్టలేకపోయారు. 6–11తో తొలి గేమ్‌లో వెనుకబడిన సాత్విక్–చిరాగ్ ఏ దశలోనూ స్కోరును సమం చేయలేకపోయారు. రెండో గేమ్‌లో పుంజుకున్నట్లు కనిపించినా ప్రత్యర్థుల ధాటికి నిలవలేకపోయారు.