మహబూబాబాద్, వెలుగు: జిల్లాలోని గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన, ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్‌లు ఆపాలని బుధవారం మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రైల్వే జీఎంకు వినతి పత్రం అందించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గార్ల రైల్వే స్టేషన్లో రెండు ప్లాట్ ఫారాలు పెంచాలని , ఎలక్ట్రిక్ డిస్ప్లే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పానుగంటి రాధాకృష్ణ, ఎంఏ జలీల్, మురళీ గౌడ్, గంజి ఈశ్వర్ లింగం,బాదం రాజేశ్, సోమ్లా నాయక్, శ్రీను, దాశరధి, రాము, తదితరులు పాల్గొన్నారు.