మామిడిపల్లి గ్రామంలో తాళం పగలగొట్టి 8 తులాల నగలు చోరీ

మామిడిపల్లి గ్రామంలో తాళం పగలగొట్టి  8 తులాల నగలు చోరీ

కోనరావుపేట, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. షేక్​హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఈనెల 3న ఆమె ఇంటికి తాళం వేసి అదే గ్రామంలో ఉంటున్న పెద్దకొడుకు వద్దకు పోయింది. ఇదే అదనుగా ఈనెల 4న రాత్రి తాళం పగలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి 8 తులాల బంగారు, 20 తులాల వెండి పట్టీలు చోరీ చేశారు. 

ఆదివారం ఇంటి పక్కన ఉండే చిన్నకొడుకు, కోడలు తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే అదే రోజు హుస్సేన్ బీ ఇంటికి సమీపంలో మరో మహిళ నిమ్మరాజులు లక్ష్మి ఇంటి తాళాన్ని కూడా దొంగలు పగలగొట్టి చోరీకి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.