డబ్బులు ఇస్తానని పిలిచి కత్తితో పొడిసిండు..

మిర్యాలగూడ, వెలుగు:  ఫ్రెండ్​కు ఫైనాన్స్​ కింద కట్టాల్సిన డబ్బులు ఇస్తానని పిలిచి ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం జరిగింది. రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. మిర్యాలగూడ మండలం దొండవారిగూడెంకు చెందిన వాంకుడోతు జలం ధర్ స్థానిక ఎఫ్ సీఐ సమీపంలో ఆటో ఎలక్ర్టిషియన్ షాపు నడిపిస్తున్నాడు.

ఈ క్రమంలో త్రిపురారం మండలం సత్యంపాడు తండాకు చెందిన ఇస్లావత్ సంతోష్ తో పరిచయం ఏర్పడింది. జలంధర్ మధ్యవర్తిగా ఉండి సంతోష్ కు ఫైనాన్స్ లో ఆటోను ఇప్పించాడు. అయితే ఫైనాన్స్ సక్రమంగా చెల్లించకపోవడంతో ఇటీవల ఇరువురి మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.

ఈ క్రమంలో డబ్బులు చెల్లిస్తానని, రైల్వే స్టేషన్ సమీపంలోకి జలంధర్ ను సంతోష్  పిలించాడు. అతడు వచ్చిన వెంటనే సంతోష్​ కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన జలంధర్ ను స్థానికులు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి​ తరలించారు. బాధితుడి తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు. ​​​  ​  ​