అది చర్చి.. ఆదివారం మధ్యాహ్నం.. ప్రార్థనలతో చర్చి మొత్తం ఫుల్ అయ్యింది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 26 ఏళ్ల వ్యక్తి లేచాడు.. నేరుగా పాస్టర్ ఎదుటకు వెళ్లాడు.. దేవుడు మిమ్మల్ని లేపేయమన్నాడు.. ఆ దేవుడే నాకు చెప్పాడు అంటూ పాస్టర్ పై తుపాకీ గురి పెట్టాడు.. అందరూ షాక్.. పరుగులు తీశారు.. ఆ వ్యక్తి చేతిలో తుపాకీ పేలలేదు.. తుపాకీ నుంచి తూటా బయటకు రాలేదు.. తుపాకీ లాక్ అయిపోయింది.. దీంతో పాస్టర్ ప్రాణాలతో బయటపడ్డాడు..
ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.. ఇక్కడ ఇద్దరినీ కాపాడింది దేవుడే అంటూ కొత్త డిస్కషన్ మొదలైంది.. దేవుడు చంపమని ఓ వ్యక్తిని పంపిస్తే.. ఆ దేవుడే అతన్ని కాపాడాడు అంటూ చర్చించుకోవటం విశేషం.. మరో విశేషం కూడా ఉంది.. ఏదంటే.. చర్చిలోని ప్రార్థనలు లైవ్ టెలికాస్ట్ అవుతుంది.. ఆ సమయంలో ఇది జరిగింది.. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఎప్పుడు జరిగింది.. ఎందుకు జరిగింది అనే పూర్తి వివరాలు తెలుసుకుందామా...
అమెరికా సముక్త రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలోని ఓ చర్చిలో ఫాదర్ జెర్మినీ అక్కడికి వచ్చిన వారి కోసం ప్రేయర్ చేస్తూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నాడు. ఈ క్రమంలోని బెర్నార్డ్ అనే వ్యక్తి ఫాదర్ ప్రసంగం ఇస్తున్నప్పుడు ముందుకు వచ్చాడు. ఫాస్టర్ జెర్మనీని చూసి నవ్వాడు. అతని నమస్తే పెడుతున్నట్టు చేసి గన్ తీసి కాల్చాడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే గన్ పని చేయలేదు.
దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురై వెంటనే అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న తుపాకీని లాగి చితకబాదారు. ఈ ప్రమాదంలో చర్చి ఫాదర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకుని నిందితుడిని పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ క్రమంలోనే బెర్నార్డ్ ని జడ్జి ఇలా ఎందుకు చేశావు అని ప్రశ్నించారు "దేవుడు నన్ను చేయమని చెప్పాడు" అందుకే చేశానని చెప్పాడు. అతను నరహత్యకు ప్రయత్నించాడని ఈ క్రమంలోని అతనికి నాన్ బెయిలెబుల్ వారెంట్ కింద్ అల్లెఘేనీ కౌంటీ జైలుకు తరలించాలని ఆదేశించింది కోర్టు. ఈ మొత్తం ఘటనపై చర్చి ఫాదర్ స్పందిస్తూ భగవంతుడు తనను రక్షించాడు అంటూ ఫాదర్ చెప్పారు.
ఒకడు దేవుడు చంపమంటే వచ్చి చంపడం మరల అదే దేవుడి వల్ల కాపాడబడటమనేది ఆశ్చర్యానికి గురిచేస్తుందని పెన్సిల్వేనియా వాసులు అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.