కొంతమంది పాపులర్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. చిన్నప్పటి కథలను ఊహించుకొని.. అచ్చం ఆ కథల మాదిరిగా చేస్తుంటారు. కొంతమంది సినిమాల్లో చేసినట్టు నిజ జీవితంలో చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా చేసేటప్పుడు అవి మనకు మేలు చేయకపోగా.. హాని కూడా కలుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయో స్టోరీకి అనుబంధం ఉన్న కథ ఒకటి చదివి తరువాత వార్తలోకి ఎంటరూపోదాం. . .
పూర్వం రాజుల పాలన ఉండేది. ఈ పాలనలో రాజులకు సెక్యూరిటీకి మనుషులపై నమ్మకం లేక కోతులను పెట్టుకొని వాటికి ఆయుధాలు కూడా ఇచ్చాడట. ఆ సమయంలో రాజు ముక్కుపై ఈగ వాలుతుంది. అయితే, ఆ ఈగ తమ రాజుకు హానీ చేస్తుందని భావించి.. సెక్యూరిటీ కోతి తన కరవాలం తీసి ఒక్క వేటు వేస్తుంది. కానీ, ఈగను చంపేందుకు కోతి ప్రయత్నిస్తే.. కత్తి వేటు దెబ్బకు రాజు ప్రాణాలు కోల్పోయాడు... అచ్చం ఇలాంటి ఘటనకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దోమను చంపేబోతే కాలు విరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
సాధారణంగా దోమలు మనుషుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తాయి. అవి మన శరీరంపై వాలకుండా మస్కిటో కాయిల్స్, ఆల్ ఔట్,దోమతెరలు ఇలా అనేకమైనవి వాడుతుంటాం. అయినా సరే కొన్ని దోమలు అతి తెలివి ప్రదర్శించి వాలుతాయి కదా.. అలాంటి వాటిని చేతితో కొట్టి చంపుతాం. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి కాలిపై కూడా దోమ వాలింది. మరి చేతితో కొడితే ఆ దోమ చచ్చిపోయేదే. కానీ, అతగాని తెలివికి దోమ చావడంతో పాటు.. మరో ఘనకార్యం కూడా జరిగింది. దెబ్బకు ఆస్పత్రికి వెళ్లి కట్లు కట్టించికునే పరిస్థితి ఏర్పడింది.
కాలిపై దోమ వాలగా.. దాన్ని చంపేందుకు సుత్తిని ఉపయోగించాడు ఓ వ్యక్తి. తన కాలిపై వాలిన దోమను చంపేందుకు సుత్తితో బలంగా కొట్టాడు. దాంతో దోమ చచ్చింది. దోమతో పాటు.. ఆ మేధావి కాలు కూడా విరిగింది. సుత్తితో బలంగా కొట్టుకోవడంతో నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే తీశారు. అందులో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. సుత్తితో కొట్టడం వలన కాలి వేలు మధ్యలో విరిగిపోయింది. ఇంకేముంది.. డాక్టర్స్ అతనికి కట్టుకట్టి ఇంటికి పంపారు. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దంటూ హితవు చెప్పారు.
ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో qazaqsolo అనే ఐడీతో షేర్ చేశారు. ఇప్పటివరకు 6.9 మిలియన్స్ వ్యూస్ రాగా, 2.28 లక్షల లైక్స్ వచ్చాయి. అతని తెలివి తేటలకు జనాలు పడి పడి నవ్వుకుంటున్నారు. మరీ ఇలా ఉన్నావేంట్రా బాబూ అని కామెంట్స్ చేస్తున్నారు. వెర్రిపుష్పం 2.O అని పంచ్‌లు వేస్తున్నారు.