పురుషులకు సీట్లు కేటాయించాలె

నిజామాబాద్:  ఆర్మూరులో బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి ఆందోళనకు దిగాడు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తుండగా.. మగవారికి సీట్లు లభించకపోవడంతో నిరనస వ్యక్తం చేశాడు. బస్సుకు అడ్డంగా నిలబడి ధర్నాకు దిగాడు. బస్సుల్లో మగవారికి కొన్ని సీట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.