
- ముగ్గురి అరెస్ట్.. కారుతో పాటు 246 కేజీల బెల్లం, పటిక స్వాధీనం
- మంచిర్యాల జిల్లా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ సీఐ సమ్మయ్య వెల్లడి
బెల్లంపల్లి, వెలుగు: రిపోర్టర్ల ముసుగులో నాటుసారా దందా చేస్తున్న ముగ్గురిని మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లంపల్లి ఎక్సైజ్ ఆఫీసులో గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ సీఐ ఎస్. సమ్మయ్య వివరాలు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తాండూర్ మండలం ఐబీ చౌరస్తా వద్ద నేషనల్ హైవే –63పై తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇండికా కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 216 కేజీల బెల్లం, 30 కేజీల పటికను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నాటుసారా తయారీకి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. గోలేటి టౌన్‌షిప్‌కు చెందిన దుర్గం రాజ్ కుమార్, డాగం సంజులతో పాటు మామిడిగూడెం గ్రామానికి చెందిన అజ్మీర్ చంద్రును అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు రిపోర్టర్ల ముసుగులో సారా దందా చేస్తున్ననట్టు సీఐ సమ్మయ్య తెలిపారు.