ప్రభుత్వ స్కూళ్లను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

ప్రభుత్వ స్కూళ్లను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్/బెల్లంపల్లి, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలను పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ జిల్లా సమన్వయకర్త కె.నాగేశ్వర్​రావు, జోనల్ అధికారి అరుణకుమారితో కలిసి టీజీఎస్​డబ్ల్యూఆర్ఎస్ ప్రిన్సిపాళ్ల, కరెస్పాండెంట్లు, భవన యజమానులతో రివ్యూ నిర్వహించారు. దేశానికి భావి పౌరులను అందించే ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్యాబోధన సమర్థంగా నిర్వహించాలన్నారు. స్టూడెంట్లకు క్రీడల్లో శిక్షణ ఇప్పించాలన్నారు. స్కూళ్ల సొంత భవనాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాలను పరిశీలించాలని, పూర్తి వివరాలతో నివేదిక అందించాలని ఆదేశించారు. 

 విద్యార్థుల ఆరోగ్యం పట్ల  ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను కలెక్టర్​ దీపక్ ఆదేశించారు. బెల్లంపల్లి మండలం లంబడి తండాలోని రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, జూనియర్ కాలేజీని ఆకస్మి కంగా తనిఖీ చేశారు.  తరగతి గదులు, వసతి గృహం, డైనింగ్​ హాల్, వంటగదిని పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యనంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.