మణుగూరు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసీల్దార్ ఆఫీస్‌లో గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించ డంతో ప్రాణాపాయం తప్పింది. బీసీలకు లక్ష లోన్ స్కీమ్‌కు అప్లై చేసుకోడానికి అవసరమయ్యే క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ ఆఫీస్‌కు జనం పోటెత్తారు.
ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు జనాలతో కిక్కిరిసిపోయింది. ఈక్రమంలో రాత్రి తోపులాట జరగడంతో ఆఫీసులో ఉన్న ఐరన్ ర్యాక్ ఊడి సమితిసింగారం గ్రామానికి చెందిన ముక్కెర లక్ష్మి అనే మహిళ తలపై పడింది. తీవ్ర గాయాలైన ఆమెను హుటాహుటిన భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా తలకు ఆరు కుట్లు పడ్డాయి. సర్టిఫికెట్ల కోసం జనాలు ఎగబడడంతో ఆఫీస్‌లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.