ముంబై: వరుస సెషన్లలో ర్యాలీ చేస్తూ వచ్చిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లకు శుక్రవారం గట్టి దెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ గ్రోత్ తక్కువగా ఉంటుందని ఇన్ఫోసిస్ ప్రకటించడంతో కంపెనీ షేర్లు ఏకంగా 8 శాతం నష్టపోయాయి. ఈ దెబ్బకు ఇతర టెక్ షేర్లు కూడా పడ్డాయి. ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా మూడున్నర శాతం వరకు పడడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల ఆరు రోజుల లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. నిఫ్టీ శుక్రవారం సెషన్‌లో 234 పాయింట్లు (1.17 శాతం) నష్టపోయి19,745 దగ్గర సెటిలయ్యింది. సెన్సెక్స్ 888 పాయింట్లు తగ్గి 66,684 వద్ద ముగిసింది. ఈ ఏడాది బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు 10 శాతం మేర పెరిగి కొత్త ఆల్ టైమ్ గరిష్టాలను టచ్ చేసిన విషయం తెలిసిందే.
మార్కెట్ పడడానికి గల కారణాలు..
1) రెవెన్యూ గైడెన్స్‌ను తగ్గించడంతో ఇన్ఫోసిస్ షేర్లు శుక్రవారం సెషన్‌లో భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో ఇతర టెక్ షేర్లు కూడా పడ్డాయి. పెర్సిస్టెంట్ షేర్లు 5.6 % పడగా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు 3 % వరకు క్రాష్ అయ్యాయి. నిఫ్టీ ఐటీ 4 శాతం నష్టపోయింది.
2) టెస్లా, నెట్‌ఫ్లిక్స్ షేర్లు పడడంతో నాస్‌డాక్ గురువారం 2 % క్రాష్ అయ్యింది. దీంతో మన మార్కెట్ కూడా పడింది.
3) జియో ఫైనాన్షియల్ షేర్ల డీమెర్జర్ పూర్తవ్వడంతో రిలయన్స్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. కంపెనీ షేర్లపై గ్లోబల్ బ్రోకరేజి సంస్థ మాకరీ ‘అండర్‌పెర్ఫార్మ్’ రేటింగ్ ఇచ్చింది. రిజల్ట్స్ ప్రెజర్ కూడా ఉండడంతో కంపెనీ షేర్లు 3.5% వరకు పడ్డాయి.
5) ఇన్ఫీ వలన ఐటీ షేర్లు పడగా, హిందుస్తాన్ యూనిలీవర్ వలన ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. కంపెనీ షేర్లు 3.6 % పడగా, టాటా కన్జూమర్, డాబర్ షేర్లు 2 % పడ్డాయి.