మారుతి, టాటా మోటార్స్ సేల్స్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌

మారుతి, టాటా మోటార్స్ సేల్స్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌
  • పెరిగిన కియా, టయోటా అమ్మకాలు

న్యూఢిల్లీ:  కార్ల అమ్మకాలు  కిందటి నెలలో తగ్గాయి. అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ సేల్స్ ఈ ఏడాది ఆగస్టులో 4 శాతం పడి 1,81,782 యూనిట్లుగా నమోదయ్యాయి. కిందటేడాది ఆగస్టులో  1,89,082 కార్లను మారుతి అమ్మింది. లోకల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో 1,43,075 బండ్లను విక్రయించిన ఈ కంపెనీ, 26,003 బండ్లను ఎగుమతి చేసింది. కిందటేడాది ఆగస్టుతో పోలిస్తే డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో సేల్స్ 8 శాతం పడిపోయాయి. కానీ, ఎగుమతులు పెరగడం విశేషం. మరోవైపు హ్యుండాయ్ కిందటి నెలలో 63,175 బండ్లను అమ్మగలిగింది. 

డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌లో మార్కెట్‌‌‌‌‌‌‌‌లో 49,525 యూనిట్లను సేల్ చేయగా, 13,650 యూనిట్లను ఎగుమతి చేసింది. కంపెనీ ఈ ఏడాది జనవరి–ఆగస్టు మధ్య 5,13,510 బండ్లను అమ్మింది. కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 2.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌06 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసింది. టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌  కిందటేడాది ఆగస్టులో 78,010 యూనిట్లు అమ్మగా, ఈ ఏడాది ఆగస్టులో  71,693 యూనిట్లను అమ్మగలిగింది. డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో 70,006 బండ్లను అమ్మింది. 

కానీ, ఏడాది ప్రాతిపదికన కంపెనీ అమ్మకాలు 8 శాతం పడ్డాయి.  టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌ మొత్తం సేల్స్‌‌‌‌‌‌‌‌లో 44,142 బండ్లు ప్యాసింజర్ వెహికల్స్ కాగా, 25,864 యూనిట్లు కమర్షియల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌. మిగిలిన కార్ల కంపెనీలలో కియా, టయోటా సేల్స్ బాగున్నాయి. కియా ఇండియా కిందటి నెలలో 22,523 బండ్లను అమ్మగలిగింది. ఏడాది ప్రాతిపదికన 17 శాతం వృద్ధి నమోదు చేసింది. టయో కిర్లోస్కర్ మోటార్ సేల్స్‌‌‌‌‌‌‌‌ 22,910 యూనిట్ల నుంచి 35 శాతం పెరిగి 30,879 యూనిట్లకు పెరిగాయి.